మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

By సుభాష్  Published on  8 Jun 2020 8:56 AM GMT
మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, ఢీజిల్‌ ధరలు పెంచాయి. చివరిగా మార్చి 16న సవరించిన పెట్రోల్‌, ఢీజిల్‌ ధరలను తాగాజా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 80 రోజుల తర్వాత ధరలు పెరగడంతో వాహనదారులకు భారం కానుంది. లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా ఆయిల్‌కు డిమాండ్‌ భారీగా పెరిగింది.

ఇక తాజాగా దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం 60 పైసల చొప్పున పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఆదివారం పెంచిన రేటుతో కలిపి రెండు రోజు మొత్తం రూ.1.20 పైసలు పెరిగింది. ఇక తాజాగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.72.46 కాగా, డీజిల్‌ లీటర్‌ ధర రూ.70.59 ఉంది.

సోమవారం పెరిగిన ధరలు (లీటర్‌కు)

♦ హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.75.22, డీజిల్‌ రూ.69

♦ ఢిల్లీలో పెట్రోల్‌ రూ. 72.16, డీజిల్‌ రూ.70

♦ ముంబైలో పెట్రోల్‌ రూ. 79.49, డీజిల్‌ రూ.69.37

♦ చెన్నైలో పెట్రోల్‌ రూ.76.60, డీజిల్‌ రూ. 69.25

♦ బెంగళూరులో పెట్రోల్‌ రూ.75, డీజిల్‌ రూ.67

Next Story