పెరిగిన బంగారం ధరలు.. ఇక కష్టమే
By తోట వంశీ కుమార్ Published on 21 March 2020 7:07 PM ISTనిన్న మొన్నటి వరకు భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. బంగారం ధర ఇంకా తగ్గుతుందేమోనని ఆశించిన వారికి ఇది పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుల సహా దేశీ మార్కెట్‌లో బంగారం కొనుగోలు ఊపందుకోవడంతో బంగారం ధర మళ్లీ పెరగడానికి కారణమైందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టింది. శనివారం ఒక్క రోజే ఏకంగా రూ.750 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి రూ.39,900కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.750 పెరిగి రూ.41,100కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.510 పెరుగుదలతో రూ.40,500కు చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.42,670కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.39,090కు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ గోల్డ్ ధర 1,514 డాలర్లుగా ఉంది.
ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి
దేశీయ కరెన్సీ విలువ సరికొత్త ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 8 పైసలు బలహీనపడి 75.20కి చేరింది. కరోనా వైరస్ భయాలు, ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు.. రూపాయి విలువకు మరింత గండికొట్టాయని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.