నిన్న మొన్నటి వరకు బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ దెబ్బకు బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్లు అల్లకల్లోలమవ్వడంతో.. వెండి, బంగారం ధరలు దిగొస్తున్నాయి. నిన్నటి వరకు యాభై వేల మార్క్ చేరేలా పరుగులు పెట్టిన పసిడి ఇప్పుడు 40వేల దిగువకు పడిపోయింది.

కరోనా ప్రభావంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు సుముఖత చూపకపోవడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పతనమవడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.  ఈ క్రమంలో గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తున్నాయి. ఎంసీఎక్స్‌లో బుధవారం 10.గ్రాముల బంగారం ధర రూ 534 తగ్గి రూ 39,710కు చేరింది. మరోవైపు వెండి కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి రూ.534 పతనమై రూ.34,882కు చేరింది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.