భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎంతంటే..?

నిన్న మొన్నటి దాకా చుక్కలు చూపించిన బంగారం ధర క్రమంగా తగ్గుతోంది. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర భారీగా తగ్గింది. మూడు రోజుల్లో రూ.2వేలకు పైనే బంగారం ధర తగ్గింది. మదుపరులు పెట్టుబడులు మళ్లించడం, రూపాయి బలపడడం వంటివి బంగారం ధర తగ్గడానికి కారణం.

డిల్లీలో శుక్రవారం ఒక్కరోజే 24 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ.1097 తగ్గి రూ.42,600కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ.1,330 తగ్గగా, 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ.1,120 తగ్గింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ.43,850 కాగా, 22 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ.40,200.

బంగారం మాత్రమే కాదు.. వెండి ధర కూడా పడిపోతోంది. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.370 తగ్గి రూ.48,030 ధరకు చేరుకోగా, న్యూ ఢిల్లీలో రూ.1,574 తగ్గి రూ.44,130 దగ్గర ఆగింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి 23 పైసలు బలపడింది.

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలో భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత మళ్లీ పుంజుకుంది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర రూ.1,584 డాలర్లు ఉండగా.. వెండి ధన రూ.15,65 డాలర్లుగా ఉంది.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *