బంగారం ఇక భారమే.. 10గ్రాముల బంగారం రూ.82వేలు..!
By తోట వంశీ కుమార్ Published on 25 April 2020 11:06 AM ISTకరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కోంటున్నాయి. ఇక ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. దీంతో బంగారం ధరలకు రెక్కలు రానున్నాయట. ఎందుకంటే.. పెట్టుబడి దారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన, అతి విలువైన లోహాలవైపు మళ్లీస్తున్నారు. పలు దేశాల్లో సమీప భవిష్యత్తులో లిక్విడిటీ సమస్యలు తతెత్తటంతో పాటు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ద్రవ్యలోటు ప్రధాన సమస్యలుగా మారబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే బంగారానికి అనూహ్యమైన గిరాకీ లభిస్తుంది. వచ్చే ఏడాది చివరి నాటికి 10గ్రాముల బంగారం ధర రూ.82వేలకు చేరుకుంటుందని బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీ (బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్) అంచానా వేసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 3 వేల డాలర్లకు చేరుకోవచ్చునని తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,726 వద్ద కొనసాగుతోంది.
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. డాలర్లలో చూస్తే బంగారం ధర గత ఏడాది కాలంలో 14 శాతం పెరిగింది. రూపాయిల్లో చూస్తే.. గత ఏడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటి వరకూ 43 శాతం పెరిగింది. కరోనా భయం లాక్‌డౌన్ వల్ల ప్రస్తుత అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోలుదార్దు అంతగా కనిపంచటం లేదు. కానీ వ్యాపారులు, ప్రజల చేతుల్లో ఉన్న బంగారం విలువ బాగా పెరిగింది.
ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతుండటం, కరోనాతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. మరోవైపు అమెరికా మార్కెట్లో క్రూడాయిల్ ప్రతికూలానికి పడిపోవడం కూడా పసిడి భగ్గుమనడానికి పరోక్షంగా దోహదం చేయనున్నదని తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా బంగారు ఆభరణాల దుకాణాలు మూతపడటంతో ఫ్యూచర్ మా ర్కెట్లో పసిడి ధర అధికమవుతున్నది.