ఒక్క‌సారిగా ప‌డిపోయిన బంగారం ధ‌ర‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 April 2020 2:08 PM GMT
ఒక్క‌సారిగా ప‌డిపోయిన బంగారం ధ‌ర‌

నిన్న మొన్న‌టి వ‌ర‌కు సామాన్యుల‌కు చుక్క‌లు చూపించిన బంగారం ధ‌ర నేడు దిగివ‌చ్చింది. క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకు విజృంభిస్తుండంతో స్టాక్ మార్కెట్ కుదేల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో చాలా మంది బంగారంలో పెట్టుబ‌డులు పెట్ట‌డంతో ఒక్క‌సారిగా బంగారం ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. కాగా శుక్ర‌వారం ఈక్విటీ మార్కెట్లు కోలుకున్నాయి. దీంతో బంగారం ధ‌ర ప‌డిపోయింది.

నిన్న 10గ్రాముల ధ‌ర రూ.47,327 ఉండ‌గా.. నేడు రూ.1396 త‌గ్గి రూ.45,862 ప‌లికింది. కిలో వెండి రూ.1342 త‌గ్గి రూ.42,913కి చేరింది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌డంతో బంగారం కొనుగోలు జ‌ర‌గ‌డం లేదు. ఇది కూడా పసిడి ధ‌ర‌లు దిగి రావ‌డానికి ఓ కార‌ణం కావ‌చ్చునని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. బంగారం ధ‌ర త‌గ్గ‌డానికి చాలా కార‌ణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధర తగ్గుముఖం పట్టింది.

Next Story
Share it