రాజ్యసభ సభ్యునిగా గొగోయ్ ప్రమాణం.. కాంగ్రెస్ సభ్యుల నిరసన !
By Newsmeter.Network
రాజ్యసభ సభ్యునిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో తన సభ్యత్వం గురించి ఆయన సమర్థించుకున్నారు. తన హాజరుతో న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాలను పార్లమెంట్‌లో చర్చించే అవకాశంగా భావిస్తున్నట్లు రంజన్ అభిప్రాయ పడ్డారు.
Also Read :అక్కడ బుధవారం ఒక్క కేసు నమోదుకాలే!
రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ చేస్తూ రాష్ట్ర పతి గత వారం క్రితం నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు నిర్వహించి ఇటీవలే పదవీ విరమణ చేసిన వ్యక్తిని రాజ్యసభ సభ్యునిగా నియమించటం సరికాదని, ఈ నిర్ణయంతో ప్రజల్లోకి తప్పుడు అర్థాలు వెళ్తాయని పేర్కొన్నారు.
Also Read :రాజ్యసభకు మాజీ సీజేఐ రంజన్ గొగోయ్.. ప్రతిపక్షాల విమర్శలు
గొగోయ్‌కు రాజ్యసభ సభ్యునిగా స్థానం కల్పించడాన్ని వెనక్కు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయినా రాష్ట్రపతి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోవటంతో గురువారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్యనే ప్రమాణ స్వీకారం చేశారు.