చంద్రబాబును దేవుడే కాపాడాలి: మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 1:09 PM GMT
చంద్రబాబును దేవుడే కాపాడాలి: మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

తిరుపతి: టీడీపీ చీఫ్‌, ప్రతిపక్ష కీలక నేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన అవినీతిని బయటకు తీస్తే 16 ఏళ్లు జైళ్లో ఉంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును దేవుడే కాపాడాలన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో ఆయన స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదన్నారు. 'మేము రౌడీయిజం చేసే వాళ్లం అయితే ప్రజలు మాకు అధికారం కట్టబెట్టరు' అని అన్నారు.

వైఎస్‌ జగన్‌ అయ్యాక రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిశాయని, నీటి ప్రాజెక్టులు నిండాయన్నారు. ఇసుక తీయడం కష్టం అవుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అనవసర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌ అయ్యారు. ఎవరు ఆత్మహత్య చేసుకున్న ఇసుక కొరత వల్లే చనిపోయారి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌ టీడీపీతో లాలూచీ చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.

Next Story
Share it