మహిళల వివాహ వయసు పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Sept 2020 7:28 AM ISTకేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులువేస్తోంది. మహిళల పెళ్లి వయసు పెంచే దిశగా ఆలోచన చేస్తోంది. దాని కోసం మహిళలు ఏ వయసులో పెళ్లి చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్న దానిపై కేంద్రం అధ్యయనం చేసేందుకు కేంద్ర మహిళ శిశు సంక్షేమ శాఖ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మహిళల కనీస వివాహ వయసు నిర్ధారణ అంశంలో కేంద్రం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని నియమించినట్లు తెలిపారు. కనీస వివాహ వయసు పెంపు గురించి ప్రస్తావించారు.
ప్రస్తుతం యువతులకు కనీస వివాహ వయసు 18 సంవత్సరాలు. యువకులకు 21 సంవత్సరాలు. కాగా, ఈ వయసును మూడు లేదా నాలుగు సంవత్సరాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పురుషులతో సమానంగా విద్యను అభ్యసిస్తున్న మహిళలకు వివాహం ఓ అడ్డంకిగా మారకుండా ఉండేలా చట్టంలో మార్పులు తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఈ అంశంపై మరింత అధ్యయనం చేసేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.