ఏనుగుల గుంపుకు జిరాఫీ ఎఫెక్ట్..!!
By సత్య ప్రియ Published on 2 Nov 2019 6:05 AM GMTఏనుగుల వల్ల పంట నష్టం కలగకుండా అసోం లోని గ్రామవాసులు ఒక వినూత్న ప్రయత్నం చేశారు. తేయాకు తోటలలోకి తరచూ ఏనుగులు వచ్చి పంట నాశనం చేస్తుండడంతో, జిరాఫీ ప్రతిమను పొలాల వద్ద ఏర్పాటు చేసారు. జిరాఫీలు ఉన్న చోటుకి ఏనుగులు రావన్న ఉద్దేశ్యంతో వారు ఈ పని చేశారు.
గోలాఘాట్ జిల్లా, అసోం లోని ఢోల్ గురీ తేయాకు తోటలలో 10 అడుగుల ఎత్తుగల జిరాఫీ ప్రతిమను అక్టోఅబర్ 31న ఏర్పాటు చేశారు. ఆ తోటల మ్యానేజర్ అలోక్ బోర్బొరా మాట్లాడుతూ, ఏనుగులకి జిరాఫీలంటే భయం అని తెలిసింది, అందుకే చక్క, ఫైబర్ ఉపయోగించి జిరాఫీ ప్రతిమ ను తయారు చేయించామని చెప్పారు.
ప్రతిమను ఏర్పాటు చేసిన తరువాత ఏనుగుల రాక కొంచేం తగ్గిందని, అయినా ఇప్పటికీ ఏనుగుల గుంపు పొలాల సమీపానికి వస్తోందని గ్రామస్థులు తెలిపారు.
జిరాఫీలు భారతదేశానికి చెందినవి కాదు, ఏనుగులకి ఈ ఆఫ్రికా జీవుల గురించి తెలియదు అందుకని ఏనుగులు ఈ ప్రతిమను చూసి భయపడుతుండవచ్చు.