లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. నగరంలోని జూబ్లిహిల్స్ సర్కిల్-18లో జగన్ అనే వ్యక్తి ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఇంటికి సంబంధించిన ముటేషన్ కోసం లంచం డిమాండ్ చేసి రూ.75 వేలు డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీ ఆశ్రయించాడు. ఖైరతాబాద్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై గణాంక భవన్ వద్ద డబ్బులు తీసుకుంటుండగా.. జగన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.