హైదరాబాద్ ప్రజలకు 72 గంటల హెచ్చరిక
By సుభాష్
హైదరాబాద్ నగరంలో వర్షం జోరుగా కురుస్తోంది. అయితే అక్టోబర్ 12 మధ్యాహ్నం నుంచి మొదలుకుని 72 గంటల పాటు అంటే దాదాపు మూడు రోజులు హైదరాబాద్ నగరంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరిస్తోంది. ఈ మేరకు నగర జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేస్ కుమార్ సోమవారం మధ్యాహ్నం హెచ్చరికలు చేశారు. 72 గంటల పాటు మహానగరం పరిధిలోని పలు ప్రాంతాల్లో అతి నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం.. హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల 9 నుంచి 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని లోకేష్ కుమార్ పేర్కొన్నారు. రాబోయే 72 గంటల పాటు అధికారులు, సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
కాగా, వాతావరణ శాఖ ప్రకారం. రాబోయే 72 గంటల పాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల వల్ల వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు తమ పరిధిలో క్షేత్రస్థాయి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి అందుబాటులో ఉంచాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను లోకేష్ కుమార్ ఆదేశించారు. అదే విధంగా ఆయా ప్రాంతాల్లో రిలీఫ్ సెంటర్లు గుర్తించిన పాఠశాలలో, కమ్యునిటీ హాల్స్, ఇతర వసతులను సిద్ధంగా ఉంచాలని సూచించారు.