నవంబర్‌, డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

By సుభాష్  Published on  7 Oct 2020 6:27 AM GMT
నవంబర్‌, డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నవంబర్‌, డిసెంబర్‌లో నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్ధసారధి ప్రకటించారు. బుధవారం ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వెల్లడించారు. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

కాగా, వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలో జీహెచ్‌ఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. కోవిడ్‌-19 నేపథ్యంలో బ్యాలెట్‌ పద్దతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్‌ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని మెజార్టీ పార్టీలు కూడా మొగ్గు చూపాయి. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story