Fact Check : క్లోరిన్ డయాక్సైడ్ కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతోందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 May 2020 9:28 AM GMT
Fact Check : క్లోరిన్ డయాక్సైడ్ కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతోందా..?

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 56 లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. 3.5 లక్షల మందికి పైగా మరణించారు. చాలా దేశాలతో పాటూ భారత్ లో కూడా లాక్ డౌన్ లో సడలింపులు తీసుకుని వచ్చారు. కరోనాతో కలిసి జీవించాల్సిందే అని చెబుతున్నారు. మరో వైపు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీ వివిధ దశల్లో ఉందంటూ ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఓ జర్మన్ సైంటిస్ట్ మాత్రం క్లోరిన్ డయాక్సైడ్ ద్వారా కరోనాను అరికట్టవచ్చని చెబుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఫేస్ బుక్ లో వైరల్ అవుతోంది.

దీన్ని ట్విట్టర్ లో కూడా షేర్ చేశారు.



ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు ఆండ్రెస్ లడ్విగ్ కల్చర్.. తాను రీసెర్చర్ అని చెబుతున్నారు. కరోనా వైరస్ కు సొల్యూషన్ క్లోరిన్ డయాక్సైడ్ లేదా సిడిఎస్ అని అంటున్నారు.

ఈయన చెబుతున్న పదార్థం అన్నది సోడియమ్ క్లోరైట్ ను సిట్రిక్ యాసిడ్(లెమన్ లేదా వెనిగర్) తో కలిపి తయారు చేసుకోవచ్చు. అలా చేయడం వలన కెమికల్ రియాక్షన్ జరిగి ఓ పసుపు రంగు పొగతో ఓ పదార్థం తయారైంది. ఆయన సూచన ప్రకారం దాన్ని నీళ్లలో కలుపుకుని తాగాలట. ఇలా చేయడం వలన ఆక్సిడైజింగ్ ఎఫెక్ట్స్ అన్నది జరిగిన వైరస్ ను కాల్చివేస్తుందట. ఇది క్రిమిసంహారకంగా పని చేస్తుందని.. చిన్న చిన్న డోస్ లలో తీసుకుంటే కరోనా వైరస్ పై అటాక్ చేయొచ్చు అని చెబుతున్నారు.. మన శరీరంలోని మిగిలిన కణాలకు ఎటువంటి ప్రమాదం లేదని చెబుతున్నారు.

సోడియం క్లోరైట్ అన్నది నీటిలో కరగడం వలన తయారయ్యే పదార్థాన్ని ఎం.ఎం.ఎస్. (మిరాకిల్ మినరల్ సొల్యూషన్ లేదా మిరాకిల్ మినరల్ సప్లిమెంట్) అని అంటారట..!

నిజమెంత:

ఆయన చెబుతున్నది పచ్చి అబద్ధం

హెల్త్ ఏజెన్సీలు ఆయన చెప్పినట్లు చేయడం వలన ఎలాంటి ఉపయోగం లేదని కొట్టి పడేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా శరీరానికి 'చాలా ప్రమాదం' అని అంటున్నారు.

సోడియం క్లోరైట్ అన్నది ఇండస్ట్రియల్ బ్లీచ్.. పేపర్, టెక్స్టైల్ ఇండస్ట్రీలలో ఉపయోగిస్తూ ఉంటారు. తక్కువ మోతాదులో వాడుతూ నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు.

క్లోరిన్ డయాక్సైడ్ అన్నది చాలా ప్రమాదకరమైనదంటూ ఎన్నో రెఫరెన్స్ లు మీ ముందు ఉన్నాయి. అలాగే “క్లోరిన్ డయాక్సైడ్ ను Covid-19 ట్రీట్మెంట్ కోసం ఉపయోగించొచ్చా లేదా??” అని సెర్చ్ చేయడం కూడా జరిగింది.

క్లోరిన్ డయాక్సైడ్ ను క్రిమిసంహారకాల కింద వాడుతున్నారు. నోట్లో ఏవన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా వాడుతున్నారు. పుక్కిలించి వేయడంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు.

https://www.researchgate.net/post/chlorine_dioxide_used_for_COVID-19_true_or_false

కరోనా వైరస్ ను అరికట్టడానికి క్లోరిన్ డయాక్సైడ్ ను ఉపయోగించి తయారుచేసిన 'మిరాకిల్ మినరల్ సొల్యూషన్' చాలా ప్రమాదకరమైనదని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 'వార్నింగ్ లెటర్' ను విడుదల చేసింది. ఇవి వినియోగదారులను మోసం చేసేవే కాకుండా.. అత్యంత ప్రమాదకరమైనవని స్పష్టం చేసింది.

ఎఫ్.డి.ఏ. గతంలో కూడా వినియోగదారులను క్లోరిన్ డయాక్సైడ్ తో తయారు చేసిన డ్రింక్స్ ను వాడకూడదని స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో ఉన్న ప్రోడక్ట్స్ పై కూడా ఓ కంట కనిపెడుతూనే ఉంది.

డైరెక్ట్ గా క్లోరిన్ డయాక్సైడ్ ను తీసుకోవడం వలన ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. methemoglobinemia, QT prolongation వంటివి.. గుండె చప్పుడులో తేడాలు, డీహైడ్రేషన్ కారణంగా లో బ్లడ్ ప్రెజర్, లివర్ ఫెయిల్యూర్, బ్లడ్ సెల్స్ కౌంట్ తక్కువ అవడం, హీమోలైటిక్ అనీమియా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, తీవ్రమైన వాంతులు, డయేరియా సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది.

https://www.fda.gov/news-events/press-announcements/coronavirus-covid-19-update-fda-warns-seller-marketing-dangerous-chlorine-dioxide-products-claim

2010 లో స్పానిష్ ఏజెన్సీ ఫర్ మెడిసిన్ అండ్ హెల్త్ ప్రోడక్ట్స్ కూడా ఎం.ఎం.ఎస్. పై హెచ్చరికలను జారీ చేసింది. ఈ ప్రోడక్ట్స్ ను తీసుకోవడం వలన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు.

https://www.aemps.gob.es/informa/notasInformativas/medicamentosUsoHumano/medIlegales/2010/NI_MUH_Ilegales_05-2010.htm

ఆండ్రెస్ లడ్విగ్ కల్చర్ తన వీడియో చెప్పింది పచ్చి అబద్ధం. దీని వలన ప్రాణాలకు కూడా ముప్పు ఉంది.

Claim Review:Fact Check : క్లోరిన్ డయాక్సైడ్ కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతోందా..?
Claim Fact Check:false
Next Story