విశాఖ ఎల్‌జీ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే ఏపీలో మరో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులో ఉన్న ఎస్పీవై ఆగ్రోస్ కంపెనీలో లిక్విడ్ కార్బన్ డయాక్సడ్ లీక్ అయింది. ఈ ఘటనలో జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందగా.. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.