మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
By సుభాష్ Published on 1 Oct 2020 5:03 PM ISTవంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి భగ్గుమంది. అంతర్జాతీయంగా చమురు ధరలకు అనుగుణంగా దేశంలో వంట గ్యాస్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది చమురు కంపెనీ. కాగా, ఎల్పీజీ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ రాజధానిలో 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.594గా ఉంది. అయితే 19 కిలోల సిలిండర్ ధర మాత్రం పెంచింది. ఒక్కో సిలిండర్‌పై రూ.32 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి కంపెనీలు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ధరల ప్రకారం..
ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ రూ.32.50 వరకు పెంచింది ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1133.50 ఉండగా, ఇకపై రూ.32.50 పెరిగి, రూ.1166కు చేరుకుంది. ఇక ముంబైలో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1089 నుంచి రూ.1113.50కి చేరుకుంది. దేశంలోని ఇతర నగరాల్లో సిలిండర్లపై రూ.35 వరకు పెంచుతూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది గ్యాస్ కంపెనీలు.
కాగా, ఈ ఏడాది జూన్‌లో అలాగే పెరిగిన ధరలు.. మళ్లీ జులై రాగానే మరోసారి పెంచేశాయి. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్‌పీజీ సిలిండర్లలో ఎలాంటి మార్పు చేయలేదు. తాజాగా మరోసారి గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.