హైదరాబాద్‌: మలక్‌పేటలోని వెంకటాద్రి నగర్‌లో అర్థరాత్రి ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. ఆ శబ్దంతో చుట్టు పక్కల ఇళ్లవారంతా ఒక్కసారిగా భయపడ్డారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. కాసేపు అయ్యాక.. శబ్దం వచ్చిన ఇంటి దగ్గరికి వెళ్లి ఏమైందని చూశారు.. తీరా అక్కడ పేలింది గ్యాస్‌ సిలిండర్. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు ధాటికి ఇళ్లు గేటుతో పాటు, అద్దాలు, పైకప్పు సైతం ముక్కలైంది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిలిండర్‌ పేలడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్ పేలడానికి ప్రధాన కారణం ఫ్రిజ్‌ అని పోలీసులు భావిస్తున్నారు. ఒక్కసారిగా సిలిండర్‌ పేలడంతో ఇంటికి దగ్గరగా నిలిపి ఉన్న పలు వాహనాలు కూడా దగ్ధమయ్యాయి.

ఫ్రిజ్‌ వల్ల గ్యాస్‌ సిలిండర్‌ ఎందుకు పేలుతుంది.?

ఇంట్లో ఫ్రిజ్‌ పక్కనే ఎప్పుడూ కూడా సిలిండర్‌ పెట్టుకోవద్దు. ఒక వేళ ఫ్రిజ్‌ పక్కనే సిలిండర్‌ పెట్టినట్లైతే.. ఫ్రీజ్‌ తరచుగా దానంతటట అదే ఆన్‌, ఆఫ్‌ అవుతుంది. ఇలా ఒక్కసారిగా ఫ్రిజ్‌ ఆన్‌ అయిన తర్వాత ఆక్సిజన్‌ విడుదల అవుతుంది. ఈ క్రమంలో సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకైతే.. అంతే సంగతులు. రెండు కలవడంతో ఒక్కసారిగా గ్యాస్‌ సిలిండర్‌ పేలుతుంది. ఇప్పటికైనా జాగ్రత్త వహించి ఫ్రిజ్‌ను సిలిండర్‌ దూరం పెట్టడం మేలు. కనీసం 10 అడుగుల దూరంలో ఫ్రిజ్‌ని పెట్టడం మేలు. వీలైతే వేరే గదిలో కూడా పెట్టుకోండి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.