ఆ రోజు నాకు స‌చిన్ వార్నింగ్ ఇచ్చాడు : గంగూలి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2020 5:24 PM IST
ఆ రోజు నాకు స‌చిన్ వార్నింగ్ ఇచ్చాడు : గంగూలి

స‌చిన్.. ఈ పేరు తెలియ‌ని క్రికెట‌ర్ అభిమాని దాదాపుగా ఉండ‌డు. తానాడిన కాలంలో దాదాపు అన్ని రికార్డులు స‌చిన్ టెండ్కూల‌ర్ పేరు మీదునే ఉన్నాయంటే అతి శ‌యోక్తి కాదు. 24 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు కూడా వివాదాల జోలికి వెళ్ల‌లేదు. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు స్లెడ్జింగ్ చేస్తే త‌న బ్యాట్‌తోనే స‌మాధానం ఇచ్చాడు. సచిన్ కోప్ప‌డిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. అయితే.. స‌చిన్ ఆగ్ర‌హాన్ని తాను చూశాన‌ని అంటున్నాడు బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలి. ఓ సారి త‌న‌కు స‌చిన్ వార్నింగ్ ఇచ్చాడ‌ని వెల్ల‌డించాడు బెంగాల్ టైగ‌ర్‌.

ఇటీవ‌ల స‌చిన్ 48వ ఒడిలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంలో.. స‌చిన్‌తో ఉన్న మ‌ధుర జ్ఞాప‌కాల‌ను సౌర‌వ్ షేర్ చేసుకున్నాడు. '1997లో వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాం. అప్పుడు భార‌త జ‌ట్టుకు స‌చిన్ కెప్టెన్‌. ఆ ప‌ర్య‌ట‌న‌లో విండీస్‌తో 5 టెస్టుల మ్యాచ్ లు ఆడాం. అయితే.. సిరీస్ 0-1తో చేజార్చుకున్నాం. విండీస్ ఆ ప‌ర్య‌ట‌న‌లో మూడో టెస్టు మ్యాచ్ గెల‌వ‌డంతో సిరీస్ విండీస్ వ‌శ‌మైంది. నిజానికి ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా గెల‌వాల్సింది. ఆ టెస్టులో విండీస్ 120 ప‌రుగుల స్వ‌ల్ప టార్గెట్ ఇచ్చింది. అయితే.. మేము 81 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యాం. దాంతో గెల‌వాల్సిన మ్యాచ్ ఓడిపోయాం. ఫ‌లితంగా విండీస్ సిరీస్ గెలుచుకుంది. గెలుపు అంచుల వ‌ర‌కు వ‌చ్చి ఓడిపోవ‌డంతో స‌చిన్ తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యాడు. ఈ క్ర‌మంలోనే నా‌పై కోపాన్ని చూపించాడు. ప్రతీ రోజూ మైదానం చుట్టూ పరుగెత్తితేనే భవిష్యత్తు ఉంటుందని హెచ్చరించాడు. నువ్వు జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే.. రోజూ ఉదయమే పరుగెత్తాల్సిందే అని వార్నింగ్‌ ఇచ్చాడు, నాకు కూడా అప్పుడు స‌చిన్ అన్న‌ది క‌రెక్టే న‌ని అనిపించింద‌న్నాడు గంగూలి.

Next Story