విజ్జీ తరువాత గంగూలే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2019 6:35 AM GMT
విజ్జీ తరువాత గంగూలే..!

ముంబై: బీసీసీఐ చీఫ్‌గా సౌరవ్‌ గంగూలీ మరో రికార్డు సృష్టించనున్నాడు. బీసీసీఐ చీఫ్‌ బాధ్యతలు స్వీకరించబోతున్న రెండో క్రికెటర్‌గా గంగూలీ చరిత్రలో నిలిచిపోనున్నాడు. గంగూలీకి ముందు 1954-56 మధ్య కాలంలో విజయనగరం మహరాజు పూసపాటి విజయానంద గజపతి రాజు (విజ్జీ) బీసీసీఐ చీఫ్‌గా వ్యవహరించారు. విజ్జీ ఆటకు సంబంధించి పలు ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. అందలో చాలా మట్టుకు వివాదస్పదమైనవే. జాక్‌ హబ్స్‌, హెర్బర్ట్‌ సట్‌క్లిఫ్‌లను పిలపించి తన సొంత ప్యాలెస్‌లో ఆడించేవారు.

1932లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు అయ్యే ఖర్చులను మొత్తం విజ్జీనె చెల్లించాడు. అయితే అనారోగ్యంతో ఆ పర్యటనకు విజ్జీ వెళ్లలేకపోయాడు. 1936లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టుకు విజ్జీ కెప్టెన్‌గా వ్యవహరించారు. భారత్‌ తరఫున కేవలం మూడు టెస్టులకే విజ్జీ ప్రాతినిధ్యం వహించారు. విజ్జీగా సన్నిహితులతో పిలిపించుకున్న మహరాజుకు పరిపాలనాధికారిగా మంచి పేరే వచ్చింది. మహరాజును మరిచిపోకుండా బీసీసీఐ విజ్జీ ట్రోఫీ పేరిట ఇంటర్‌ యూనివర్పిటీ జోనల్‌ టోర్నమెంట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అలాగే సునీల్‌ గవాస్కర్‌, హైదరాబాదీ శివలాల్‌ యాదవ్‌ కొద్దికాలంపాటు బోర్డు తాత్కాలిక అధ్యక్షులుగా వ్యవహరించారు.

Next Story
Share it