మంత్రి గంగుల కమలాకర్ ఎస్కార్ట్ వాహనం బోల్తా..
By తోట వంశీ కుమార్ Published on
11 July 2020 11:23 AM GMT

మంత్రి గంగుల కమలాకర్ ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. కరీంనగర్ జిల్లా మానకొండూరులో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం వస్తున్న క్రమంలో ఆయన కాన్వాయ్‌లోని ఓ ఎస్కార్ట్ వాహానం ఆర్టీసీ వర్క్‌షాప్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొత్తపల్లి ఎస్సై ఎల్లాగౌడ్ గాయపడ్డారు. ఆయన చేతి బొటనవేలు తెగిపోయింది. వెంటనే ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించారు.
Next Story