ఓ సారి చనిపోయాడని.. మరోసారి వెంటిలేటర్‌పై ఉన్నాడని.. చివరికి..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 May 2020 3:04 AM GMTగాంధీ ఆస్పత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యంతో తన భర్త బతికి ఉన్నాడా..? చనిపోయాడా..? తెలియని పరిస్థితి ఏర్పడింది. వివరాళ్లోకెళితే.. వనస్థలిపురంలో కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. భర్త మధుసుధన్‌ను అధికారులు మొదట కింగ్ కోటి ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత అక్కడి నుండి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అయితే.. కరోనా నుండి కోలుకున్న మిగతా కుటుంబసభ్యులు ఇంటికి చేరుకోగా.. మధుసూదన్ మాత్రం ఇంటికి రాలేదు. దీంతో.. భార్య మాధవి హాస్పిటల్ సిబ్బందిని ప్రశ్నించింది. అయితే.. ఆసుపత్రి సిబ్బంది మాత్రం పొంతన లేకుండా ఒకసారి చనిపోయాడని, మరోసారి వెంటిలేటర్‌పై ఉన్నాడని సమాధానం ఇచ్చింది.
ఈ విషయాన్ని మాధవి ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు టాగ్ చేసింది. దీంతో ఘటనపై గాంధీ సుపరీడెంట్ స్పందించారు. మే 1న మధుసూదన్ చనిపోయినట్టు నిర్దారించారు. మృతదేహాన్ని పోలీసులకు ఇచ్చినట్టు వివరణ ఇచ్చారు. అయితే.. కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురు చూడకుండానే జీహెచ్ఎంసీ మధుసూదన్ మృతదేహనికి అంత్యక్రియలు పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నా అధికారులలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఏదేమయినా భర్త చివరి చూపుకు నోచుకోక పోవడం ఆ భార్యకు జీవితాంతం కలిచివేసే విషయమే.