వైద్యుడి తప్పిదం..కన్నుమూసిన పసిప్రాణం..అపాయంలో మరో ప్రాణం
By రాణి Published on 17 March 2020 6:05 PM ISTగాంధీ ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన అక్కడున్నవారిని కలచివేసింది. నిండు గర్భిణీకి ఆపరేషన్ చేసి..ఒక ప్రాణాన్ని లోకంలోకి తీసుకురావాల్సిన వైద్యుడు..నెలలు నిండని గర్భిణీకి అకారణంగా ఆపరేషన్ చేసి..ప్రాణం పోయేందుకు కారకుడయ్యాడు.
Also Read : నాకు మరణశిక్ష రద్దు చేయండి : నిర్భయ దోషి పిటిషన్
సికింద్రాబాద్ లో ఉన్న గాంధీ ఆస్పత్రిలో ఓ వైద్యుడి తప్పిదం వల్ల ఓ పసిప్రాణం లోకం చూడకుండానే కన్నుమూసింది. ఆస్పత్రిలో డెలివరీ కోసం వచ్చిన మహిళకు కాకుండా, మరొక మహిళకు చేయడంతో అప్పుడే పుట్టిన బిడ్డ మృతి చెందింది. భవానీ అనే నిండు గర్భిణీకి చేయాల్సిన ఆపరేషన్ నెలలు నిండని సమత(7నెలల గర్భిణి)కు చేయడంతో పసిప్రాణం కన్నుమూసింది. అంతే కాక సమతకు ఎక్కువగా రక్తస్రావం అవ్వడంతో ఆమె ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.
Also Read : కరోనాను లెక్కచేయని ప్రభాస్ టీం
కాగా..ఆ డాక్టర్ ఆపరేషన్ చేసేందుకు వచ్చిన సమయంలో పూర్తి తెలివిలోనే ఉన్నాడా లేక కాస్తంత మద్యం సేవించి ఆపరేషన్ చేసేందుకు రావడం వల్ల ఇలా ఉందా అని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా వైద్యుడు దేవుడితే సమానమంటారు కదా..మరి ఆ వైద్య దేవుడే ఇప్పుడొక పసిప్రాణం పోయేందుకు కారణమయ్యాడు. మరో పెద్దప్రాణం అపాయంలో ఉంది.
Also Read : 24 గంటలు.. 14,000 కేసులు.. 7,100 మరణాలు
మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రుల్లో చేయాల్సిన సర్జరీలన్నింటినీ తక్షణమే వాయిదా వేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అత్యవసరమైతే తప్ప సర్జరీలు చేయకూడదని సూచించింది.