24 గంటలు.. 14,000 కేసులు.. 7,100 మరణాలు

By రాణి  Published on  17 March 2020 7:09 AM GMT
24 గంటలు.. 14,000 కేసులు.. 7,100 మరణాలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్..గడిచిన 24గంటల్లో మరింత విఝృంభించింది. 24 గంటల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 14,000 కేసులు నమోదవ్వగా..భారత్ లో కొత్తగా 10 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మనదేశంలో కరోనా బాధితుల సంఖ్య 125కి చేరగా..కరోనా మరణాల సంఖ్య 3కి చేరింది. తెలంగాణలో 4 కరోనా కేసులు నమోదవ్వగా..తొలి కరోనా బాధితుడు కోలుకుని మూడ్రోజుల క్రితమే ఇంటికి చేరుకున్నాడు. మంగళవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్య 1,67,500 దాటినట్లు పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే ఆయా దేశాల అధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చని..వివిధ సంస్థల అధికారులు చెబుతున్నారు.

Also Read : కరోనా పై ఆర్ఆర్ఆర్ హీరోలు చెప్పిన ఆరుసూత్రాలివే (వీడియోతో)

చైనాను వదిలేసిన కరోనా వైరస్ ఇప్పుడు ఐరోపా దేశాలపై విరుచుకుపడుతోంది. కరోనా కారణంగా చాలా దేశాల ప్రజలు నిర్భందంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ విజృంభణపై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ..వైరస్ లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరింది. వైరస్ ను కట్టడి చేసేందుకు ఇంతకుమించిన మరో మార్గం లేదని సంస్థ చీఫ్ టెడ్రోస్ అధానోమ్ అభిప్రాయపడ్డారు.

Also Read : చేవెళ్లలో దారుణం.. ‘దిశ’ ఘటన తరహాలోనే..

చైనా వెలుపల కరోనా పై యుద్ధం జరుగుతుండగా..చైనాలో మాత్రం ఈ వైరస్ భారీ స్థాయిలో తగ్గుతోంది. సోమవారం ఆ దేశ వ్యాప్తంగా ఒక్కకరోనా కేసే నమోదవ్వడమే ఇందుకు నిదర్శనం. అయితే..ఇతర దేశాల నుంచి వచ్చిన 20 మందికి కరోనా ఉన్నట్లుగా నిర్థారణవ్వడంతో..ఆ దేశం ఆందోళన చెందుతోంది. గతంలో కూడా తమ దేశంలో వైరస్ వ్యాపించడానికి కారణం అమెరికానే అని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆరోపించారు కూడా. సోమవారం మరో 13 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ దేశ కరోనా మృతుల సంఖ్య 3,226కు చేరగా..ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 7,000 దాటింది. చైనా తర్వాత కరోనా బాధితులు, మృతులు ఎక్కువగా ఉన్న దేశం ఇటలీ.

Also Read : కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం 15 సూచనలు

గడిచిన రెండ్రోజుల్లోనే 700 మందికి పైగా కరోనా బాధితులు చనిపోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. సోమవారం ఒక్కరోజే 349 మంది చనిపోవడంతో..ఇటలీ కరోనా మృతుల సంఖ్య 2,158కి చేరింది. ఇప్పటికే ప్రజల రవాణా మార్గాలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం..ఇకపై బీచ్ లకు కూడా వెళ్లేందుకు వీలులేకుండా నిబంధనలను అమలు పరిచింది. కాగా..డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 79,611.

Next Story