'గడ్డి తింటావా' సాంగ్‌.. 17లక్షల వ్యూస్‌.. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు అంకితం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2020 2:50 PM GMT
గడ్డి తింటావా సాంగ్‌.. 17లక్షల వ్యూస్‌.. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు అంకితం

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పవర్ స్టార్’. వ‌ర్మ ఈ సినిమా ప్రకటించిన అప్ప‌టి నుండి ప్ర‌జ‌ల్లో అమిత‌మైన ఆస‌క్తి నెల‌కొంది. వ‌ర్మ ఏం చూపించ‌బోతున్నాడో అంటూ సినీ, రాజకీయ వర్గాలలో ఈ సినిమాపై చర్చలు మొద‌ల‌య్యాయి.

అయితే సినిమా ప్ర‌క‌టించిన నాటి నుండి సినిమాకు సంబంధించి వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టించారు వ‌ర్మ‌. ఈ సినిమా నుంచి ఇటీవల గడ్డి తింటావా సాంగ్‌ను ను విడుదల చేశారు. ఈ పాటను 17లక్షల మంది వీక్షించారని వర్మ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. పాట విడుదలైన రెండు రోజుల్లోనే ఇంత భారీ రెస్పాన్స్‌ రావడంపై వర్మ స్పందిస్తూ.. ఈ విజయం పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కి అంకితం అని ట్వీట్‌ చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను రేపు ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే ప్ర‌పంచ చ‌రిత్ర‌లో తొలిసారిగా కేవ‌లం ట్రైల‌ర్‌ను వీక్షించ‌డానికి ఫ‌ర్ వ్యూ రూ. 25లు వ‌సూలు చేస్తున్న‌ట్లు వ‌ర్మ ప్ర‌క‌టించారు. క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు లేక.. ఓటీటీల‌ను న‌మ్ముకున్న వీక్ష‌కులు వ‌ర్మ ప‌వ‌ర్ స్టార్ ట్రైల‌ర్‌ను ఏమేరకు వీక్షిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మ‌రి.Next Story