హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కరోనా రోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం 1500 పడకలతో కూడిన ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. ఈ ఆస్పత్రిని శనివారం కేంద్ర బృందం పరిశీలించింది.

భారత ప్రభుత్వ జలశక్తి శాఖ అడిషనల్‌ సెక్రెటరీ అరుణ్‌ బరోకా, పబ్లిక్‌ హెల్త్‌ సీనియర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ డైరెక్టర్‌ హేమలత, జాతీయ కన్జ్యూమర్‌ మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ ఎస్‌. ఎస్‌. ఠాకూర్‌, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శేఖర్‌ చతుర్వేదిలు విచ్చేసి ఆస్పత్రిని పరిశీలించారు. ఆస్పత్రి ఏర్పాట్లను వారు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కాగా, ఈ కేంద్ర బృందానికి ఆస్పత్రికి సంబంధించిన ఏర్పాట్లను పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ రమేష్‌, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ రవి కిరణ్‌లు వివరించారు. రాష్ట్రంలో కరోనాపై తీసుకుంటున్న చర్యలపై అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.