చేపలు, చికెన్ తింటే కరోనా రాదు

By రాణి  Published on  28 Feb 2020 6:46 PM IST
చేపలు, చికెన్ తింటే కరోనా రాదు

చేపలు, చికెన్ తింటే కరోనా రాదని పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఫిష్ ఫెస్టివల్ ను ఆయన పరిశీలించారు. ఈ ఫెస్టివల్ లో సుమారు 100 రకాల చేపల వంటకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బేగం బజార్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో చేపల మార్కెట్లను ఏర్పాటు చేస్తామని, అలాగే అన్ని మున్సిపల్ డివిజన్లలో ఔట్ లెట్లు, రాష్ర్ట వ్యాప్తంగా ఫిష్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మరోవైపు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద శుక్రవారం సాయంత్రం నుంచి చికెన్, కోడి గుడ్లతో చేసిన వంటకాలను ఉచితంగా అందించింది పౌల్ర్టీ సమాఖ్య. చికెన్ తినడం వల్ల కరోనా రాదని తెలియజేయడమే ముఖ్యోద్దేశంగా ఈ మేళాను నిర్వహించినట్లు నెక్ సభ్యుడు జి రాంరెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ సహకారంతో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, తెలంగాణ పౌల్ట్రీ బీడర్స్ అసోసియేషన్, నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీతో పాటు ఇతర ప్రైవేట్ కంపెనీలు చికెన్, ఎగ్ మేళాను నిర్వహిస్తున్నాయి. ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో..ఇటు తెలుగు రాష్ర్టాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే..కోళ్లకు కరోనా వచ్చే చనిపోయాయంటూ ప్రచారం ఊపందుకుంది. నిజానికి కోళ్లకు వచ్చిన వ్యాధి కరోనా కాదని తెలిపారు మంత్రి తలసాని. చికెన్ ఉత్పత్తులు తినడం వల్ల కరోనా రాదని స్పష్టం చేశారు.

Next Story