డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామన్నారు.. రూ.కోటి వసూలు చేశారు.. ఆ తర్వాత

By అంజి  Published on  15 Feb 2020 2:37 PM GMT
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామన్నారు.. రూ.కోటి వసూలు చేశారు.. ఆ తర్వాత

హైదరాబాద్‌లో రోజు రోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు మోసగాళ్లు కొత్త రూట్లను ఎంచుకుంటున్నారు. పక్కా స్కెచ్‌ వేసి కేటుగాళ్లు కోట్లు కొట్టేస్తున్నారు. మాయమాటలతో మభ్య పెట్టి డబ్బులను కొల్లగొడుతున్నారు. ఎదుటివాళ్ల బలహీనతలను వాడుకొని కొందరు మోసగాళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్న.. నగరంలో ఎదో చోట ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వం పట్టా ఫ్లాట్‌, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, రాజీవ్‌ గృహకల్ప ఇళ్లులు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సైదాబాద్‌, మాదన్నపేట, సంతోష్‌నగర్‌, బండ్లగూడ ప్రాంతాలకు చెందిన స్థానిక ప్రజల నుంచి రూ.1 కోటి లక్ష రూపాయల నగదు వసూలు చేశారు. నకిలీ పట్టాలను ఇచ్చి మోసం చేశారని తెలుసుకున్న బాధితులు వెంటనే సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుర్మగూడ సైదాబాద్‌కు చెందిన మహమ్మద్‌ మసూద్‌ హైమద్‌, బండ్లగూడకు చెందిన కాజా గౌస్‌ ఉద్దీన్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని సీసీఎస్‌ పోలీసుల కోర్టులో హాజరుపర్చారు.

Next Story
Share it