జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో డయాల్‌గామ్‌ ఏరియాలో ఆదివారం భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. డయల్‌గావ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా, భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భారత సైనికులు నలుగురిని హతమార్చారు.

కుప్వారా జిల్లాలో ఇద్దరు మిలిటెంట్లను అరెస్టు చేసి ఒక రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. వారి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హతమైన ఉగ్రవాదులు కశ్మీర్‌ జిల్లాలోని విల్గం ప్రాంతంలోని షేక్‌పోరా తారత్‌పోరాకు చెందిన వారుగా గుర్తించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.