ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బస్తర్‌ జిల్లాలోని మర్దమ్‌ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్‌, సీఎఎఫ్‌ సిబ్బందిపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. మావోలు సిబ్బందిపై కాల్పుల వర్షం కురిపించారు. దీంతో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్‌ జవాన్లు మావోయిస్టులపై ఎదురుదాడికి దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఏఎఫ్‌కు చెందిన కానిస్టేబుళ్లు అమరులయ్యారు. మరొకరికి గాయాలయ్యాయి. కాగా, గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న తరుణంలో మరోసారి కాల్పులతో మారుమోగిపోయింది. మావోయిస్టులకు ఛత్తీస్‌గఢ్ అడ్డగా మారడంతో అనునిత్యం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.