నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల ప్రాణం తీసిన మద్యం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Nov 2019 8:11 AM GMT
నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల ప్రాణం తీసిన మద్యం

చెన్నై: రైలు పట్టాలపై కూర్చొని మద్యం తాగులన్న నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు సరదా విషాదంగా మారింది. పట్టాలపై కూర్చొని మద్యం తాగుతుండంగా వారి పైనుంచి రైలు పోవడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. తమిళనాడు కోయంబత్తూరులోని రావత్తూరు సమీపంలోని సూలూర్‌ సమీపంలో రాత్రి సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతులు తనయార్‌ ఇంజినీరింగ్‌ కాలేజి విద్యార్థులు డి. సిద్ధిఖ్ రాజా(22), రాజశేఖర్ (20), ఎం గౌతం (23), కురుస్వామి(24)లుగా రైల్వే పోలీసులు గుర్తించారు.

వివారాల్లోకెళితే.. సూలూరులోని రౌతర్ పాలం రైల్ ఓవర్‌బ్రిడ్జి సమీపంలోని రైలు పట్టాల వద్ద కూర్చొని నలుగురు మద్యం తాగుతున్నారు. అంతలో చెన్నై-అల్లప్పుంజా ఎక్స్‌ప్రెస్ రైలు విద్యార్థుల పైనుంచి వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. విఘ్నేష్ అనే మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గాయపడిన విఘ్నేష్ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. రైలు కిందపడి మరణించిన నలుగురు విద్యార్థుల మృతదేహాలను కోయంబత్తూర్ ప్రభుత్వ వైద్యకళాశాలకు తరలించారు. విద్యార్థులు రైల్వే ట్రాక్‌పై కూర్చొని మద్యం తాగుతుండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సంఘటన స్థలమైన రైల్వేట్రాక్ వద్ద మద్యం బాటిళ్లు, ప్లాస్టిక్ కప్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..

Next Story