ఒకే కాన్పులో నలుగురి జననం.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 20 Oct 2019 12:42 PM IST

ఒకే కాన్పులో నలుగురి జననం.

కర్ణాటక: కర్ణాటకలోని విజయపుర పట్టణంలో అరుదైన సంఘటన జరిగింది. ముదునూరు మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతిలో ఓ తల్లి ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు మగ పిల్లలు కాగా..మరో ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. తల్లి దాలిబాయితో సహా నలుగురు బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే శుక్రవారం రాత్రి 12 గంటలకు దాలిబాయి డెలివరీ అయింది. బిడ్డల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు.

Next Story