హైదరాబాద్‌: నగరంలో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. కేటీఆర్‌ సీఎంగా ప్రమాణస్వీకారం అంటూ మోసానికి పాల్పడ్డారు. కేటీఆర్‌ పీఏ తిరుపతి రెడ్డి పేరు చెప్పి ఏపీ మాజీ రంజీ క్రికెట్‌ ప్లేయర్‌ మోసాలకు పాల్పడుతున్నాడు. నాగరాజు అనే నిరుపేద క్రికెట్‌ ప్లేయర్‌.. ఇండియా టీమ్‌ అండర్‌ 25 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌, ఐపీఎల్‌ మ్యాచ్‌కు సెలెక్ట్‌ అయ్యడంటూ.. తన గురించి గురించి చెప్పుకుంటూ మోసాలు చేస్తున్నాడు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల చేతలు మీదుగా కిట్లు అందిస్తామని ప్రైమ్‌ ఇండియా కంపెనీకి 3 లక్షల రూపాయలు టోకరా వేశాడు.

అలాగే ఫిబ్రవరి 9న కేటీఆరే తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని, ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణస్వీకారం సభలో స్పాన్సర్‌ షిప్‌ ఇపిస్తానని నాగరాజు మోసానికి యత్నించాడు. అయితే అప్పటికే నాగరాజు పేరును గూగుల్‌ సెర్చ్‌ చేసి.. అతడు చీటర్‌ అని కంపెనీ యాజమాన్యం తెలుసుకుంది. తాము మోసపోయామని తెలుసుకున్న కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీకాకుళంకు చెందిన ఏపీ మాజీ రంజీ క్రికెట్‌ ప్లేయర్‌ నాగరాజును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా నాగరాజు పలు మోసాలకు పాల్పడ్డాడని సమాచారం.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.