మాజీ మంత్రి, వైకాపా సీనియర్‌ నాయకులు పెన్మత్స సాంబశివరాజు కన్నుమూత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2020 6:20 AM GMT
మాజీ మంత్రి, వైకాపా సీనియర్‌ నాయకులు పెన్మత్స సాంబశివరాజు కన్నుమూత

వైసీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. ఉమ్మడి రాష్ట్రంవలో ఎనిమిని సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా గుర్తింపు పొందారు. 1958లో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నిక అయిన ఆయన .. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేసారు. 1989-94 మధ్య మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన ఆయన రాజకీయ కురువృద్దుడిగా గుర్తింపు పొందారు. ఆ తరువాత వైకాపాలో చేరారు.

సాంబశివరాజు మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ.. మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు సాంబశివరాజు అని సీఎం కొనియాడారు. ఆయన మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story
Share it