పులుల రక్షణ కోసం ఆ దంపతులిద్దరూ ఏం చేస్తున్నారంటే..?

పులి క్రూరమైనదే కావచ్చు కానీ అది కూడా జంతువే, అసలు పులే కాదు వన్యప్రాణులు అన్నీ ప్రకృతి సమతుల్యతను కాపాడేవే.. వాటిని కాపాడటంలోనే మన భవిష్యత్తు కూడా ముడి పడి ఉందంటున్నారు కోల్‌కతాకు చెందిన రవీంద్రదాస్, గీతాంజలి. పులుల పరి రక్షణ కోసం ద్విచక్రవాహనంపై భారతదేశ యాత్ర సాగిస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు.

Img 20191030 095342

దేశంలోని అడవులలో ఉన్న పులులను పరిరక్షించాలి అనే నినాదంతో ద్విచక్రవాహనంపై భారతదేశ యాత్రకు శ్రీకారం చుట్టారు రవీంద్రదాస్, గీతాంజలి. దంపతులిద్దరూ కలిసి తమ మోటార్ సైకిల్ పై దేశంలోని పులుల అభయారణ్యంలో తిరుగుతూ పులులను పరిరక్షించండి పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదంతో ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కోల్‌కతాలో ఫిబ్రవరి 15వ తేదీన జర్ని ఫర్ టైగర్ అనే పేరుతో ఈ యాత్రను ప్రారంభించారు. ఇప్పటికే వీరు 28 రాష్ట్రాలు 5 కేంద్రపాలిత ప్రాంతాలు చుట్టేశారు. ఒక్క పులులే కాదు ఇతర వన్యప్రాణులను కూడా పరిరక్షించాలని ప్రచారం చేస్తున్నారు. యాత్రలో భాగంగా వీరు ఒడిషా రాష్ట్రంలోని మయూర్భంజ్ లోని జాతీయ పార్కును సందర్శించారు.

Img 20191030 095348

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.