పాఠశాలలకు సెలవులు
By సుభాష్Published on : 30 Dec 2019 3:44 PM IST

పొగమంచు దట్టంగా అలుముకుంటుంది. ఈ కారణంగా జమ్మూకశ్మీర్‌లో -6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హర్యానాలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. తీవ్ర పొగమంచుతో ఢిల్లీ విమానాశ్రయంలో రాకపోకల సమయాలను మార్చారు అధికారులు. దాదాపు 500 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా, పొగమంచు కారణంగా 21 విమానాలను దారి మళ్లించినట్లు, మరో ఐదు విమానాలను రద్దు చేశామని అధికారులు వెల్లడించారు.
దక్షిణాది రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో శీతల గాలులు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సున్నా, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆయా రాష్ట్రాల్లో అధికారులు 'రెడ్ అలర్ట్' ప్రకటించారు.
Next Story