దారుణం.. చెరువులో మునిగి ఐదుగురు బాలికలు మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2020 5:06 AM GMT
దారుణం.. చెరువులో మునిగి ఐదుగురు బాలికలు మృతి

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఐదుగురు బాలికలు మరణించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లా బోకార్డన్‌ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తలేగాం వాడీ గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు బట్టలు ఉతకడానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతికే క్రమంలో ఊదుగురు బాలికలు చెరువులోకి దిగారు. అయితే.. వారు ప్రమాద వశాత్తు పూడికలో చిక్కుకుపోయారు. అటుగా వెలుతున్న కొందరు గమనించి చెరువు వద్దకు చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేశారు. వారిని ఆస్పత్రి తీసుకెళ్లగా అప్పటికే ఆ బాలికలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మృతి చెందిన బాలికలను అశుబీ లతీఫ్ పఠాన్ (6), నబియా నవాజ్ పఠాన్ (6), అల్ఫియా గౌస్ ఖాన్ పఠాన్ (7), సానియా అస్లాం పఠాన్ (6), షాబు అస్లాం పఠాన్ (5)గా గుర్తించారు. బాలికల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతుండగా.. ఒకే సారి గ్రామానికి చెందిన ఐదుగురు బాలికలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story
Share it