మత్స్యకారుల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు అందజేసే భృతి రూ. 4000 నుండి రూ. 10000 లకు పెంపుపై మత్స్యకారులు ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో మత్స్యకారులు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టూరిజం మంత్రి అవంతీ శ్రీనివాస్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి.. ర్యాలీని నిర్వహించారు.