చేపలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి

By సుభాష్  Published on  13 Jun 2020 3:44 PM IST
చేపలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి

బాగా పెరిగి కొవ్వుపట్టిన చేపలను వారానికి కనీసం మూడు సార్లు అయినా తింటే వాటిద్వారా వచ్చే మంచి కొవ్వు గుండెజబ్బులు రానివ్వకుండా ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధనలలో తేలింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఒక సంవత్సర కాలంలో సగటున ప్రతి మనిషి 17 కిలోల చేపలను తింటున్నారు. కానీ భారత దేశంలో ఆరు కిలోలు మాత్రమే తింటున్నారు. ఆసియాలోని జపాన్‌, చైనా తదితర దేశాలలో 30 నుంచి 60 కిలోల వరకు చేపలను తింటున్నారు. చేపలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని ని చేప మంచి ఆహారమని, చేపలు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను సైతం దూరం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చేపలు ఎందుకు తినాలి..?

చేపలను తినడం వల్ల మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు. చేప మాంసం సులభం జీర్ణం అవుతుంది. చేపలో పుష్కలంగా ఉండే ఒమేగా-3 కొవ్వు, ఆమ్లాలు మానవుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేప కాలేయ నూనెలో విటమిన్‌-ఏ, విటమిన్‌-డి ఉంటాయి. చేప మాంసంలో కాల్షియం, పాస్పరస్‌, ఫెర్రస్‌, మెగ్నీషియం, జింక్‌ వంటి మినరల్స్‌ లభిస్తాయి. ఇక సముద్ర చేపలలో అయెడిన్‌ కూడా అధికంగా ఉంటుంది.

శరీర అవయవాలకు చేపలు ఎంతో మేలు

చేపలు తినడం వల్ల మన శరీర అవయవాలకు లబ్ది చేకూరుతుంది. చేప మాంసంలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులను దూరం చేస్తాయి. బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. రక్తనాళాలు మూసుకుపోవడం తగ్గిపోతాయి. అలాగే చేపలను క్రమంగా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కంటికి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచేందుకు చేపలు ఎంతో ఉపయోగపడతాయి. కీళ్ల నొప్పులు తగ్గిపోవడం, కొన్ని రకాల క్యాన్సర్లను సైతం అదుపులో ఉంచుతుంది. నిద్ర సమస్య తగ్గిపోతుంది. ఇది చదవండి: రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..? అయితే జాగ్రత్త

డిప్రెషన్‌, ఒత్తిడికి గురవుతున్నవారికి చేపలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. చేపలలో ఉండే ఆయిల్స్‌లో మానసిక రుక్మతలను అదుపు చేసేగుణాలు అధికంగా ఉంటాయి. చేపలలో విటమిన్‌ డి, ఒమేగా -3 వంటివి అధికశాతం ఉండటంతో నిద్రలేమితో బాధపడుతున్నవారికి మంచి ఆహారంగా ఉంటుంది. శరీరంలో కొలెస్టాల్‌ను రానివ్వదు. ఒక వేళ అప్పటికే శరీరంలో కొవ్వు పెరిగిపోయినట్లయితే నెమ్మదిగా కరిగించే గుణం చేపల్లో ఉంటుంది. చేపల వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి. రెచీకటి,కంటికి సంబంధిత ఇతర సమస్యలన్నీ చెక్‌పెడతాయి చేపలు. ఇది చదవండి: ఇది మతిమరుపునకే కాదు.. అన్ని వ్యాధులను అడ్డుకుంటుంది

చేపలలో మెగ్నీషియం, పోటాషియం, జింక్‌, అయోడిన్‌, ఐరన్‌ ఇంకా ఎన్నో ఖనిజాలు, పోషకాలు పుష్క్లంగా లభిస్తాయి. అలాగే చేపలు తినడం వల్ల కూడా బరువు పెరగరు. తరుచూ చేపలు తినే వారి చర్మం ఎంతో కాంతివంతంగానూ, యవ్వనంగానూ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేపల్లో మెగ్నీషియం ఉండటం వల్ల రక్తపోటును నివారిస్తుంది. అంతేకాదు గుండె సమస్యలను దూరం చేస్తుంది.

Next Story