కేరళలో తొలి కరోనా మరణం
By రాణి Published on 28 March 2020 12:53 PM IST
భారత్ లో కూడా రోజు రోజుకూ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజులోనే దేశ వ్యాప్తంగా సుమారు 160 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 873 కరోనా కేసులుండగా..మృతుల సంఖ్య 19 కి చేరింది. తాజాగా కేరళలో ఓ వ్యక్తి (69) కరోనాతో మృతి చెందడంతో కరోనా మృతులు 20కి పెరిగింది. కేరళలో ఇదే తొలి కరోనా మరణం. కొచ్చికి చెందిన వ్యక్తి ఐసోలేషన్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దేశం మొత్తం మీద కేరళలోనే ఎక్కువ కరోనా కేసులు వెలుగు చూశాయి. 180 కి పైగా కరోనా కేసులు కేరళలోనే నమోదైనట్లు తెలుస్తోంది.
Also Read : వారంరోజులైంది..అది లేక నిద్ర కూడా పట్టట్లేదు..
విదేశాల్లో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇండియాకి 15 లక్షల మంది విదేశాల నుంచి వచ్చినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. వీరిలో 55 వేల మంది హైదరాబాద్ లోనే దిగారు. ఇతరత్రా ప్రాంతాల్లో కూడా విదేశాల నుంచి వచ్చిన వారిలోనే కరోనా కేసులు ఎక్కువున్నట్లు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పుడు కరోనా బాధితుల ద్వారా వారి కుటుంబ సభ్యుల్లో కూడా కరోనా లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ తరుణంలో భారత్ లో కరోనా మూడో స్టేజ్ కు చేరే ప్రమాదముంది. ఇదే గనుక జరిగితే..భారత్ లో ఈ వైరస్ మహమ్మారి మరింత విజృంభించే అవకాశాలెక్కువ.
Also Read : పది పరీక్షలు లేకుండానే ఇంటర్ లోకి..?