రివ్యూ రైట‌ర్స్ పై ఫైర్ అవుతున్న సినీస్టార్స్

By Newsmeter.Network  Published on  12 Dec 2019 7:55 AM GMT
రివ్యూ రైట‌ర్స్ పై ఫైర్ అవుతున్న సినీస్టార్స్

సినిమా బాగోలేదు అని రాస్తే.. వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను స్వీక‌రించేవారు ఒక‌ప్పుడు. కాలం మారింది.. అందుక‌నే అనుకుంట సినిమా బాగోలేదు అని రాస్తే.. సినిమా చూడ‌డం రాదా..? లేక రాయడం రాదా..? అని ప్ర‌శ్నిస్తున్నారు ఇప్పుడు. ఈ మ‌ధ్య కాలంలో దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ కి కాస్త నెగిటివ్ రివ్యూ వ‌స్తే... బ‌న్నీ ఇది క‌మ‌ర్షియ‌ల్ సినిమా. క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఇలాగే ఉంటుంది.

ముందు క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోండి అంటూ క్లాస్ పీకారు. అలాగే ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కూడా బ‌న్నీ స్టైల్ లోనే రివ్యూ రైట‌ర్స్ పై ఫైర్ అయ్యారు. జై ల‌వ‌కుశ టైమ్ లో సినిమాని బ‌త‌క‌నీయండి కాస్త ఆగండి అంటూ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న‌దైన స్టైల్ లో క్లాస్ చెప్పేసారు. ఇక యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ అయితే... రివ్యూ రైట‌ర్స్ కి ఓ కోర్స్ అంటూ ఉండాలి అంటూ కొత్త‌గా స‌ల‌హాలు ఇచ్చేసారు.

తాజాగా 90 ఎంఎల్ సినిమా రివ్యూ గురించి హీరో కార్తీకేయ స్పందిస్తూ... రివ్యూ రైట‌ర్స్ ఈ సినిమా అస‌లు బాగోలేద‌ని రాయ‌డం.. త‌మ అభిప్రాయాన్ని అంద‌రి అభిప్రాయంగా రాయ‌డం క‌రెక్ట్ కాదు. చాలా మంది బాగుంది అంటున్నారు కానీ.. రివ్యూ రైట‌ర్స్ మాత్రం ఎందుకు ఇలా రాసారో అర్ధం కావ‌డం లేద‌న్న‌ట్టుగా త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసారు.

ఇలా.. సినిమా బాగోక‌పోతే బాగోలేదు అని రాస్తే.. రివ్యూ రైట‌ర్స్ ని విమ‌ర్శిస్తున్న ఈ రోజుల్లో... విమ‌ర్శ‌ల‌ను స్వీక‌రించి నెక్ట్స్ మూవీతో రివ్యూ రైట‌ర్స్ ని మెప్పిస్తాను అని చెప్పిన హీరో అంటే నాగ చైత‌న్య‌. శైల‌జారెడ్డి అల్లుడు సినిమాకి రివ్యూలో నెగిటివ్ గా వ‌స్తే... చైత‌న్య వాటి గురించి స్పందించి... త‌దుప‌రి చిత్రంతో మెప్పిస్తాన‌ని చెప్పాడే కానీ... రివ్యూ రైట‌ర్స్ అలా రాయ‌డం త‌ప్పు అని అన‌లేదు. ఇలా.. అంద‌రూ ఆలోచిస్తే బాగుంటుంది.

Next Story