'వెంకీమామ' గురించి నాగ్ ఇలా చేస్తున్నాడేంటి..?
By Newsmeter.Network Published on 11 Dec 2019 8:38 AM IST
విక్టరీ వెంకటేష్, యువ సమ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో రూపొందిన భారీ మల్టీస్టారర్ వెంకీమామ. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు రెట్టింపు అయ్యాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సినీ ప్రముఖులు చాలా మంది ఈ ట్రైలర్ పై స్పందించారు. తమ అభిప్రాయాన్ని తెలియచేసారు కానీ.. అక్కినేని నాగార్జున మాత్రం స్పందించలేదు. ఈ మూవీ ట్రైలర్ గురించికానీ.. ఇటీవల ఖమ్మంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కానీ.., నిన్న జరిగిన వెంకీ మామ మ్యూజికల్ నైట్ ఈవెంట్ గురించి కానీ.. నాగార్జున ట్విట్టర్ లో స్పందించలేదు. ఈ నెల 12న వస్తున్న మమ్ముట్టి మమాంగం మూవీ ట్రైలర్ ను నాగార్జున రిలీజ్ చేసారు కానీ.. వెంకీమామ గురించి అస్సలు స్పందించకపోవడం ఆశ్యర్యం కలిగిస్తుంది.
దీనికి తోడు ఇప్పటి వరకు జరిగిన వెంకీమామ ఈవెంట్స్ లో నాగ చైతన్య తప్పితే... దగ్గుబాటి హీరోలు హజరయ్యారు కానీ... అక్కినేని హీరోలు ఎవరూ కూడా హాజరు కాలేదు. ఎందుకిలా జరుగుతోంది అనేది అర్ధం కావడం లేదని కొంత మంది అభిమానులు ఆలోచనలో పడ్డారు. వెంకీమామ థియేటర్స్ లోకి వచ్చేందుకు ఇంకా రెండు రోజులు టైమ్ ఉంది కాబట్టి.. ఈ రెండు రోజుల్లో ఏమైనా నాగ్ స్పందిస్తారేమో చూడాలి.