హైదరాబాద్‌: మలక్‌పేట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ఆదిహోండా షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో 50 బైక్‌లు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌, ఇతర సామాగ్రి కాలిబూడిదైంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిప్రమాదం జరగడానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story