హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏజీ కార్యాలయం ఎదురుగా ఉన్న భవనంలో మంటలు భారీగా వ్యాపించాయి. ఐదో ఫ్లోర్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రెండు అగ్నిమాపక శకటాలతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.