ముంబాయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మజ్గావ్‌లోని జీఎస్టీ భవన్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అర్పుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగనట్లు తెలుస్తోంది. ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. భవనంలో కొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.