బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ఆరుగురు సజీవ దహనం
By తోట వంశీ కుమార్ Published on 20 March 2020 6:27 PM IST
తమిళనాడులోని ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
విరుదునగర్ జిల్లా సిప్పిపారెయ్ వద్ద ఉన్న బాణాసంచా పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నాం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు సజీవదహనం కాగా.. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సాతుర్ స్టేట్ ఆస్పత్రికి తరలించారు. అధిక ఉష్ణోగ్రత కారణంగానే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story