మంచి రసపట్టులో విరిగిన మంచం.. కోర్టుకెక్కిన జంట

ఆ జంట మంచి రసపట్టులో ఉండగా మంచం విరిగింది. దీంతో వాల్లిదరూ కోర్టుకెక్కారు న్యాయం చేయమని. ఈ ఘటన ఇంగ్లాండ్‌లో వెలుగుచూసింది. బెర్క్‌షైర్ నగరానికి చెందిన జాన్ మార్షల్, క్లైర్ దంపతులు. ఇటీవల ఓ ఫర్నీచర్‌ షోరూమ్‌లో కొత్త మంచం కొన్నారు. ఇంటికి వెళ్లాక దీనిపై కామకలాపాలు మొదలెట్టారు. ఇద్దరు మంచి రసపట్టులో ఉండగా.. మంచం విరిపోయింది. దీంతో ఆ జంటకు గాయాలయ్యాయి.

ఇద్దరూ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఆ తరువాత ఫర్నీచర్‌ సంస్థపై కోర్టులో కేసు వేశారు. లండన్‌ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. దీనిపై క్లైర్‌ మాట్లాడుతూ.. తన భర్తతో శృంగారంలో పాల్గొన్న సమయంలో ఒక్కసారిగా మంచం విరిగిపోయింది. దాని వల్ల తన వెన్నుముకకు తీవ్రగాయమైందని చెప్పింది. మంచం విరిగి.. తన భార్య నొప్పితో విలవిల్లాడుతున్నప్పుడు అదంతా సరదా కోసం చేస్తుందని మొదటి భావించానని, కానీ ఎంతకీ పైకి లేవలేకపోవడంతో ఆస్పత్రికి తరలించానని జాన్‌ కోర్టుకు తెలిపాడు. తమకు నష్టాన్ని కలిగించినందుకు.. సదరు ఫర్నిచర్‌ సంస్థ నుంచి పరిహారం ఇప్పించాలని కోరారు. అయితే.. తమ సంస్థ తయారుచేసిన మంచంలో ఎలాంటి లోపం లేదని, తాము అన్ని జాగ్రత్తలు తీసుకునే దాన్ని తయారు చేశామని సంస్థ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు. మంచాన్ని సరిగ్గా బిగించకపోవడంతో వల్లే అది విరిగిపోయి ఉండొచ్చని వివరించారు. కాగా.. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *