సఫిల్‌గూడలో భారీ అగ్ని ప్రమాదం.. కొవ్వత్తే కారణమా..?

By Newsmeter.Network  Published on  31 Dec 2019 4:34 AM GMT
సఫిల్‌గూడలో భారీ అగ్ని ప్రమాదం.. కొవ్వత్తే కారణమా..?

హైదరాబాద్‌: మల్కాజిగిరిలోని ఓల్డ్‌ సఫిల్‌గూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో వెంటనే స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా డిసెంబర్‌ నెల కరెంట్‌ బిల్లు కట్టలేదని లైన్‌మెన్‌ మురళి ఓ ఇంటికి కరెంట్‌ కట్‌ చేశారు. గంటలో కరెంట్‌ బిల్లు కడతామని చెప్పినా వినకుండా కరెంట్‌ కట్‌ చేశాడు. చేసేది ఏమి లేక ఆ కుటుంబ సభ్యులు ఇంట్లో కొవ్వొత్తి వెలిగించి చర్చ్‌కి వెళ్లారు. అదే సమయంలో పక్క పోర్షన్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు బయట ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు ఆ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక వేళ గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులు అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చిన్నారులు ఇంట్లో ఉంటే ప్రాణాలతో దక్కేవారు కాదేమోనని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అపార్ట్‌మెంట్‌లో 11 కుటుంబాలు నివసిస్తున్నాయి. కరెంట్‌ లైన్‌మెన్‌ మురళి తన ప్రతాపాన్ని సామాన్య ప్రజలపై చూపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వంద రూపాయల కరెంట్‌ బిల్లు ఉన్నా సరే వారి కరెంట్‌ కట్‌ చేసి తరచూ ఇబ్బందులకు గురి చేస్తూ, అవహేళనగా మాట్లాగుతున్నాడని మురళిపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. లైన్‌మెన్‌ మురళిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story