ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
By Newsmeter.Network Published on 31 Dec 2019 9:23 AM IST
హైదరాబాద్: ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లిటిల్ ప్లవర్ కాలేజీ చౌరస్తాలో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. హబ్సిగూడ బాష్యం స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఆటోలో వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో మృతుల తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
Next Story