ఏపీ: కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

By సుభాష్  Published on  14 Oct 2020 12:05 PM GMT
ఏపీ: కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

ఏపీలోని మరో కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద ఉన్న కెమికల్‌ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన మెటీరియల్‌ రూమ్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద స్థలానికి దాచేపల్లి పోలీసు, రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు.

అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. మంటలు ఎగిసిపడుతుండటంతో కిలోమీటర్‌ పరిధి వరకు కెమికల్‌ దుర్వాసన వ్యాపించింది. మంటలను అదుపు చేయలేకపోతే కెమికల్‌ దుర్వాసన వల్ల ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.

Next Story
Share it