ఒక పక్క పోతున్నాయి.. మరో పక్క వస్తున్నాయి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2019 5:23 PM IST
ఒక పక్క పోతున్నాయి.. మరో పక్క వస్తున్నాయి..!

ఢిల్లీ: దేశంలో ఆర్థిక మాంద్యం కారణంగా వేల కంపెనీలు మూత పడడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే వారిలో దాదాపు 7 లక్షల మందిని కొత్త కంపెనీలు తాత్కాలికంగా ఉద్యోగాల్లోకి చేర్చుకున్నాయి. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, ఫుడ్‌ డెలివరీ, ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కంపెనీలు ఉద్యోగాలు కల్పించాయి. దాదాపు లక్షా 40 వేల మందికి అమెజాన్‌, ప్లిఫ్‌కార్ట్‌ సంస్థలు కొలువులను ఇచ్చాయి. ఈ సంస్థలు దేశంలోని చివరి ప్రదేశం వరకు డెలివరీ సౌకర్యాన్ని కల్పించాలన్న లక్ష్యంతో కొత్త ఉద్యోగులను చేర్చుకుంది. సేల్స్‌ నెట్‌వర్క్‌లో 30శాతం ఉద్యోగాలను పెంచింది. ఇండియన్‌ స్టాఫింగ్‌ అసోసియేషన్‌ గణన ప్రకారం 6,50,000 వేల ఉద్యోగాలను కొత్త కంపెనీలు ఈ పండుగ సీజన్‌లో సృష్టించాయి. ప్రధానంగా డెలివరీ కంపెనీలు, దాని అనుబంధ కంపెనీల్లో జోరుగా ఉద్యోగ నియామకాలు జరిగాయని ఇండియన్‌ స్టాఫ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షురాల రితుపర్ణ చక్రబర్తి తెలిపారు.

Next Story